Teluguvaani | A monthly Telugu magazine
TeluguVani
వ్యక్తులు చూపే ప్రేమ గొప్పది కానీ వారిచ్చే వస్తువులు కావు – కిరాతార్జునీయం
Jasper_National_Park-Mothers_Day
బ్యాక్ గ్రౌండ్ ఫోటో పంపినవారు: శశిప్రసాద్

అందరికీ నమస్కారములు

‘అమ్మ అంటే’ అనే శీర్షిక కొరకు ‘మీ స్పందన-మీ మాటలలో’ అనే మా అభ్యర్ధనను మన్నించి, అనూహ్యంగా స్పందించిన మీ అందరికీ కృతజ్ఞతాభివందనాలు. ఎంతోమంది సాహిత్య పండితుల దీవెనలు మాకు అందాయంటే అది నిజంగా మాకు పెద్ద వరమే. ఈ శీర్షిక ద్వారా ప్రతి మనిషిలోనూ ఒక సాహిత్యాభిమాని, ఒక కవితా హృదయం, సమయోచితంగా స్పందించే భావుకత వున్నాయని మరొక్కసారి ఋజువైంది.

ఇంకెందుకు ఆలస్యం మరి! పాఠకుల స్పందన పరికించండి. ఈ మా సంకల్పం మిమ్ములను కదిలించి మీ లోని భావుకతను, కవితా మూర్తిని నిద్ర మేల్కొలిపినదంటే, ఎంతో సంతృప్తికరంగా వుంది.