TeluguVani
ఎక్కువ సదుపాయాలు ఎక్కువ సుఖాన్నిస్తాయనేది భ్రమ – స్వామి చిన్మయానంద
Children-Day

ముందు మాట

అందరికి బాలల దినోత్సవ శుభాకాంక్షలు

మా పత్రికకు వస్తున్న స్పందనను చూస్తుంటే మా మనసు చిన్న పిల్లల వలె ఎంతో ఆనందముతో గంతులు వేయుచున్నది. ఆదరించిన మీ అందరికి కృతజ్ఞతలు. మీరు అందించిన ఈ తోడ్పాటు ఎల్లప్పుడూ మాకు వుండాలని అభిలషిస్తున్నాము.

ఈ సంచికలో ‘ఆచారం-అంతరార్ధం’ అనే క్రొత్త శీర్షికను ప్రారంభించాము. ఈ శీర్షిక యొక్క ముఖ్యోద్దేశం ఆ శీర్షిక లోనే ఉపోద్ఘాతములో డి. వి. ఆర్. భాస్కర్ గారు వివరించారు. పత్రికకు మరింత వన్నె తెచ్చే రీతిలో పిల్లలందరికి ఇష్టమైన పిల్లల కథలను కూడా మొదలుపెట్టాము. మీరు చదవండి. మీ పిల్లల చేత చదివించండి. మీ ప్రోత్సాహమే మాకు రెట్టింపు ఉత్సాహము.

అభినందనలతో
మధు