TeluguVani
మనిషికి మంచి మనసుండాలే గాని, నానా విధాలా సంపదలు వాటంతట అవే వస్తుంటాయి – తులసీదాస్
Sun-Rays

ముందు మాట

అందరికి దీపావళి శుభాకాంక్షలు

మా మొదటి సంచికకు వచ్చిన అనూహ్య స్పందనను చూసి ఎంతో ఆనందము కలిగినది. ఆదరించిన మీ అందరికి కృతజ్ఞతలు. మీరు అందించిన ఈ తోడ్పాటు ఎల్లప్పుడూ మాకు వుండాలని అభిలషిస్తున్నాము.

తెలుగువాణి పత్రికకు ఒక ట్యాగ్ లైన్ వుంటే బాగుంటుందనే ఆలోచనలో భాగంగా పేరులో చిన్న మార్పు చేసాము. గమనించగలరు.  అంతే కాక థీమ్ కూడా మార్చాము. దీనివలన మన పత్రికకు మరింత అందం వచ్చిందని చెప్పవచ్చు. ఏవైన అభిప్రాయ భేదాలుంటే నిర్మొహమాటంగా తెలుపగలరు.

పత్రికకు మరింత వన్నె  తెచ్చే రీతిలో మీ అందరికి ఇష్టమైన కథల శీర్షికను కూడా పొందుపరిచాము. మీ ప్రోత్సాహమే మాకు రెట్టింపు ఉత్సాహము.

అభినందనలతో
మధు