invisible hit counter
TeluguVani
కష్టాలలోనే కటిక నిజాలు బోధపడుతూ వుంటాయి –భైరన్

నాటి నుండి నేటి వరకు తండ్రి అనే పదానికి ఎంతో గౌరవము, ఎన్నో బరువు బాధ్యతలున్నాయి. కుటుంబ సౌఖ్యం కొరకై సదా కృషి సలిపే నాన్న ఔన్నత్యాన్ని వర్ణిస్తూ ధర్మదాత అనే చిత్రంలో వచ్చిన ఈ మంచి పాటని పితృదినోత్సవం సందర్భంగా మీకు అందిస్తున్నాం. HAPPY FATHER’S DAY!!!

పాట సేకరణ: ఉమ బుడమగుంట
చిత్రం: ధర్మదాత సంగీతం: టి. చలపతిరావు
గానం: ఘంటసాల, పి. సుశీల, జయదేవ్ సాహిత్యం: డా.సి.నారాయణరెడ్డి

ఈ పాటను క్రింది ప్లేయర్ ద్వారా వినండి.
 

పల్లవి:
ఓ నాన్నా - ఓ నాన్నా..
ఓ నాన్న! నీ మనసే వెన్న
అమృతం కన్నా - అది ఎంతో మిన్న
ఓ నాన్నా ఓ నాన్నా..

చరణం 1:
ముళ్ళబాటలో - నీవు నడిచావు
పూలతోటలో - మమ్ము నడిపావు
ముళ్ళబాటలో - నీవు నడిచావు
పూలతోటలో - మమ్ము నడిపావు
ఏ పూట తిన్నావో - ఎన్ని పస్తులున్నావో
ఏ పూట తిన్నావో - ఎన్ని పస్తులున్నావో
పరమాన్నం మాకు - దాచి ఉంచావు  
ఓ నాన్నా ఓ నాన్నా..

చరణం 2:
పుట్టింది అమ్మ - కడుపులోనైనా
పాలు పట్టింది - నీ చేతిలోన
పుట్టింది అమ్మ - కడుపులోనైనా
పాలు పట్టింది - నీ చేతిలోన
ఊగింది - ఉయ్యాలలోనైనా
ఊగింది - ఉయ్యాలలోనైనా
నేను దాగింది - నీ చల్లని ఒడిలోన
చల్లని ఒడిలోన (ఓ నాన్న! నీ మనసే వెన్న)

చరణం 3:
ఉన్ననాడు - ఏమి దాచుకున్నావు
లేనినాడు చేయి - సాచనన్నావు
ఉన్ననాడు ఏమి - దాచుకున్నావు
లేనినాడు చేయి - సాచనన్నావు
నీ రాచ గుణమే - మా మూలధనము
నీ రాచ గుణమే - మా మూలధనము
నీవే మాపాలి దైవము (ఓ నాన్న! నీ మనసే వెన్న)